సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలను వారి నివాసాలకు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ వినూత్న పర్యటనలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అపూర్వ విజయాలు, అద్భుతమైన అభివృద్ధి గురించి కేంద్రమంత్రి వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా, దేశీయంగా ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా (UPI) ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడం వంటి అపురూప విజయాలను ఆయన వివరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి బహూకరించారు. మోదీ దార్శనికతతో భారతదేశం మరింతగా ముందుకు దూసుకుపోతుందనే అపారమైన నమ్మకాన్ని తాను కలిసిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేశారని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆయన కలసిన వారిలో భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి గుప్తా, అయ్యప్ప ఏజెన్సీస్ అధినేత కాయిత రమణ, ప్రముఖ బిల్డర్ గన్నబత్తుల శ్రీనివాస్, ఆక్వా వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తదితరులు ఉన్నారు. అలాగే వైద్య రంగంలో భీమవరం హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపాలరాజు, డాక్టర్ కూనపరాజు కృష్ణంరాజు, డాక్టర్ జి.వి.ఎస్.ఎన్. రాజు, వర్మ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ పి.ఆర్.కె. వర్మ , డాక్టర్ రంగ ప్రసాద్ రాజు, డాక్టర్ సోమరాజు, డాక్టర్ వేగేశ్న రామకృష్ణంరాజు, తదితరులతో ముచ్చటించారు. డిఎన్ఆర్ కాలేజీ పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు నరసింహారాజు,గాదిరాజు బాబు, గోకరాజు పాండురంగ రాజు, ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ జగపతి రాజు, ప్రొఫెసర్ గన్నబత్తుల పద్మారావు లతో ముచ్చటించారు. .
