సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం ఎంతో అండగా నిలుస్తోందని భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు, సోమవారం 65 మంది లబ్ధిదారులకు రూ 46,44,302 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తుందని, ఇప్పటి వరకు భీమవరం నియోజక వర్గంలో 881 మందికి రూ 6,82,10,546 లను అందించామన్నారు. ప్రభుత్వ భవిష్యత్తులో కూడా అవసరమున్న ప్రతిఒక్కరికి ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు ,కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు.
