సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. ఇటీవల ఆంద్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని.. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ఫై ప్రతిపక్ష వైసీపీ నేతలు కుల రాజకీయాలు, కుల చిచ్చు ఎగదోస్తున్నారని, ఆ దిశగా ఆఖరికి అనేక కేసులలో నిందితుడు అయిన రౌడీ షీటర్ సాయి కృష్ణ కు వత్తాసు పలుకుతూ కుల రాజకీయాలు చేస్తున్నారని, హత్యలు మానభంగాలు, అమ్మాయిలపై దాడులు చేసే వారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తూ వారి బుద్దిని చాటుకొంటున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాపు నాయకుల అనుచిత వ్యాఖ్యలు,వారి కార్యాచరణపై కూడా ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. జనసేన జిల్లా అడ్జక్షుడు కొటికలపూడి గోవిందబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనకు విసిగి పోయిన రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇప్పటికీ వారి అరాచకాలు ఆగలేదని అన్నారు. వారు ఇంకా ,నేరగాళ్లకు వంత పాడుతున్నరని అన్నారు. జనసేన కేవలం కాపు పార్టీ కాదని అందరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ అని , కులం పేరుతొ రౌడీలకు మద్దత్తు ఇవ్వలేమని వారిని రక్షించలేమని, చట్ట ప్రకారం శిక్షించవలసిందేనని, పవన్ ఆదేశాలు పాటించడమే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.
