సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నంలో నేడు, మంగళవారం జరిగిన రాష్ట్ర శాసనసభ పిటిషన్స్ కమిటీ సమావేశంలో ..రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించినట్లు కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమర్పించిన పిటిషన్లపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన సమస్యలను వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఇకపై ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీనికోసం . సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను నేరుగా సమావేశానికి తీసుకువచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ కృషి చేస్తోందన్నారు.ఇకపై శాసన సభలో సభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు లాగా మరింత చొరవ చూపి వారి ప్రాంత సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని రఘురామకృష్ణంరాజు కోరారు.
