సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం ఉదయం భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన “పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ” సమావేశంలో జిల్లా కలెక్టర్ సి. నాగరాణి తో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ/ఎస్టీ పై త్రైమాసిక సమీక్ష నిర్వహించి, వివిధ కేసుల పురోగతి, బాధితులకు అందుతున్న సహాయం, అలాగే ఈ చట్టాన్ని అమాయకులపై కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించ కుండా మరింత సమర్ధవంతగా చట్టాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తుతంగా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు రెవిన్యూ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి ఉదయం కాళ్ళ మండలంలోని సీసలి, కాళ్ళ గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో తన మిత్రుల సహకారంతో ప్రతి పాఠశాలలో పదేసి కంప్యూటర్ లతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను ‘రఘురామ’ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *