సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మధురవాడలో ఏకంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఈ స్థలానికి సంబంధించి ఆయన ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు? భావిస్తున్న విషయం ఆయన పోలీస్ పిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. రూ.2 కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం ఇక విశాఖలోని సామాన్యులకు సైతం ఆందోళన కలిగిస్తుంది. రఘురామకృష్ణంరాజు 1989లోనే విశాఖ మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దీని ధర రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ విలువైన స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని పలుమార్లు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ (రిజిస్ట్రేషన్) కూడా చేసినట్లు? భావిస్తున్నారు. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందటంతో ..ఈ ఫోర్జరీ వెనుక ఉన్న దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు ప్రతినిధులు పీఎంపాలెం పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పీఎంపాలెం పోలీసులు జూన్ 20న కేసు నమోదు చేశారు. సదరు నకిలీ రిజిస్ట్రేషన్లు ?వెనుక ఉన్న వాస్తవాలు, సూత్రధారులుఫై పోలీస్ దర్యాప్తు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *