సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 1, బహుబలి 2 సిరీస్ సిన్మాలు సృష్టించిన ప్రభంజనం అత్యధిక ప్రేక్షకులు సినిమాహాళ్లలో చుసిన సినిమాలుగా భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి బాహుబలి 3’ ఉంటుందా ? లేదా ఎంతోకాలంగా ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. . తాజాగా ఈ సినిమా ‘బాహుబలి: ది టార్చ్‌ బేరర్‌’ టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కన్నా ముందూ సదరు ఓటీటీ సంస్థ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ ‘బాహుబలి 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. మరి ప్రకటించింది ఎవరో కాదు.. మీ అందరికోసం బాహుబలి మూడో పార్టు రానుంది’ అని ప్రభాస్‌, రానా, అనుష్క స్వయంగా తెలిపారు. ప్రభాస్ అయితే 2 చేతులతో 3 వేళ్ళు చూపుతూ మరి ప్రకటించారు( ఫై చిత్రంలో) అంతే కాదు ఈ చిత్రం తనకు ఓ ఎమోషనల్‌ జర్నీ అని ప్రభాస్‌ భావోద్వేగానికి గురయ్యారు .దర్సక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తీసున్నా వారణాసి పూర్తీ అయ్యాక వచ్చే 2027ఏప్రిల్ తరువాత బాహుబలి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి నుండే దీనికి సంబందించిన కధ చర్చలు ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *