సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం యనమదుర్రు డ్రైనేజీపై దశాబ్దం క్రితం నిర్మించిన వంతెన కు ఎట్టకేలకు అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. శరవేగంగా పనులు జరుగు తున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి వాహనదారులకు వినియోగంలోకి తీసుకుని వస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రకటించారు. భీమవరం మండలం గొల్లవాని తిప్ప గ్రామంలోని వంతెన పై జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. వంతెన చుట్టూ పక్కల అన్ని క్షుణంగా పరిశీలించి ఏఈ ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల విషయంలో ఎటువంటి జాప్యం వద్దని, ఎటువంటి సహాయం కావాలన్నా తక్షణమే అందిస్తామని, ఈ వంతెన లకు అప్రోచ్ రోడ్డులు వేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. సుమారు రూ 23 కోట్లతో రెండు వంతెనలకు అప్రోచ్ రోడ్డులు వేస్తున్నారని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *