సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి అనుగ్రహం కోసం ఎప్పటిలానే వచ్చే సోమవారం ప్రతి పౌర్ణమి నాడు జరిపే చండీ హోమం దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉదయం 7 గంటలకు నిర్వహించబడుతుంది. అనంతరం వ్యవసాయం ఊపిరి పోసుకొనే ఆషాడ మాసం ఆరంభాన్ని సూచించే జ్యేష్ట పౌర్ణమి సందర్బంగా ఏరువాక పున్నమి సందర్బంగా రైతు సోదర, సోదరీమణులకు, భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ఆశీస్సులుతో..వర్షాలు చక్కగా పడి, వ్యవసాయ సమృద్ధి, పాడి పంటల వృద్ధి తో సుఖ శాంతులు, సిరి సంపదలు కలగాలని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని అద్భుతమైన సంకల్పంతో ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ ధాన్యలక్ష్మి పూజ, అలానే మహిళలు సౌభాగ్యం కొరకు శ్రీ సౌభాగ్యలక్ష్మి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి.
