సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నం సమీపంలోని అధునాతన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో జూలై ఎనిమిదో తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. విమాన ప్రయాణికుల టికెట్లపై యూడీఎఫ్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి టెంపరరీ యూడీఎఫ్ టారిఫ్‌ను ఎయిర్‌పోర్టు రెగ్యులేటరీ అథారిటీ తాజాగా విడుదల చేసింది. భోగాపురం నుంచి బయల్దేరే డొమెస్టిక్ ప్యాసింజర్లకు రూ.835, భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేవారికి రూ.355.. యూడీఎఫ్ ఛార్జీలు వసూలు చేస్తారు. మరోవైపు విశాఖ విమానాశ్రయం.కూడా ప్రస్తుతానికి కొనసాగుతుందని విశాఖ కలెక్టర్ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చిన్న సైనిక విమాన స్థావరంగా 1941లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం నాటి బ్రిటిషర్లు విశాఖ విమాన స్థావరాన్ని నిర్మించారు.1954లో ఇక్కడి నుంచి పౌర విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1981 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి.సుమారుగా 80 ఏళ్లపాటు సేవలు అందించిన విశాఖపట్నం ఎయిర్ పోర్టు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తూ ఉండటంతో త్వరలో నేవీ చేతుల్లోకి ?వెళ్లనుంది. వ్యూహాత్మక భద్రతా కారణాల నేపథ్యంలోవిశాఖపట్నం విమానాశ్రయం భారత నౌకాదళం కు సేవలు అందిస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *