సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు ఆదివారం ఉదయం నుండి 5 ఏళ్ళ లోపు చిన్నారులకు పల్స్ పోలియా చుక్కలు వేసే కార్యక్రమం ఉదృతంగా జరుగుతుంది. భీమవరం గునుపూడి ఇందిరా గాంధీ మునిసిపల్ స్కూల్ లో నేడు, ఆదివారం ఉదయం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం లో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , మునిసిపల్ అధికారుల, ఉద్యోగుల పర్యవేక్షణ లో కార్యక్రమం వాడవాడలా జరుగుతుంది.
