సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హిందువుల ఆరాధ్య దైవం, ధర్మానికి ప్రతీక గా నిలచిన శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా శ్రీరామ భక్తులు ఇచ్చిన కోట్ల రూపాయలు విరాళాలులో , కోట్ల రూపాయలు విలువైన వెండి ఇటుకలు , భక్తులు దేవాలయ హుండీలలో సమర్పించిన కానుకలు కొంత మేర దోపిడీకి గురి అయ్యాయని తేలడంతో దేశవ్యాప్తంగా భక్తులలో ఆందోళన తలెత్తింది. కానుకలు లెక్కింపు కమిటీలో పెద్దల రాజీనామా పరంపర మొదలయ్యింది. స్థానిక యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టింది.దీనిపై తాజగా నేడు, సోమవారం అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే న్యాయవాదులపై రూ.5 లక్షల జరిమానా విధిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా శరణ్ మిశ్రా స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ ఇన్‌ఛార్జి గోపాల్‌రావుపై కేసు నమోదు చేయాలని కూడా బార్ అసోసియేషన్ తీర్మానించింది. వీరంతా మరో మూడు రోజుల్లో అయోధ్యను వీడాలని, లేనిపక్షంలో నగరమంతా బంద్ చేపట్టి, ఆలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించింది.కాగా.. 2005లో రామ జన్మభూమి తాత్కాలిక ఆలయంపై జరిగిన ఉగ్రదాడి కేసులోనూ నిందితుల తరఫున వాదించబోమని నాడు ఇదే బార్ అసోసియేషన్ ప్రకటించింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు. ఆలయ విరాళాల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో అరెస్టయిన ఎనిమిది మందిలో అనుకల్ప్ మిశ్రా, అతడి బావమరిది లవ్‌కుశ్‌ మిశ్రా కీలక నిందితులని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవలి కాలంలో అనుకల్ప్ మిశ్రా కొనుగోలు చేసిన కారులు, పామ్ హౌస్, గత సంవత్సరం అయోధ్యలో సుమారు రూ. 65 లక్షల విలువైన ఒక ఇంటిని కూడా అనుకల్ప్ కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *