సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం మధ్యాహ్నం భీమవరం టౌన్ స్టేషన్ లో నరసాపురం- అరుణాచలం రెగ్యులర్ వీక్లి ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పచ్చజెండా ఊపి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల జూలై 10 నుంచి నర్సాపురం–బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సేవలను కూడా ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రకటించారు. రానున్న రోజుల్లో నర్సాపురం నుంచి భీమవరం మీదుగా విశాఖపట్నానికి పగటి పూట రైలు సర్వీస్, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్, అలాగే నర్సాపురం నుంచి వారణాసికి నేరుగా రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీనివాస వర్మ తెలిపారు. రైల్వే జోన్ విభజన కారణంగా ఉన్నతాధికారుల మార్పులతో కొంత ఆలస్యమైనప్పటికీ, ఈ ప్రాజెక్టులను తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు. భీమవరం రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.18 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ప్లాట్‌ఫాం విస్తరణతో పాటు పలు ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం రైల్వే స్టేషన్లను కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *