సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త పారిశ్రామిక హబ్‌గా, ముఖ్యంగా ‘స్టీల్ స్టేట్‘గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర ఉక్కు పరిశ్రమల సహా మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను వారిరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గ్రీన్ స్టీల్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాన్ని కూడా ‘ఉక్కుసీమ’గా మారుస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువచ్చామన్నారు. అంతేకాదు స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఇక్కడి యువతకే ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు.,నేటి ఉదయం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం లోని లూథరన్ హై స్కూల్ నుండి హెలికాఫ్టర్ లో జమ్మల మడుగు వెళ్లారు. నేటి సాయంత్రం భీమవరం చేరుకొంటారు.
.
