సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మెకానిక్స్ డే సందర్భంగా ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు శుక్రవారం భీమవరం కిషోర్ థియేటర్ వద్ద నుంచి కొడవల్లి రోడ్డులోని అసోసియేషన్ భవనం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. 1885లో జర్మనీకి చెందిన గాట్లిబ్ డైమ్లర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌ తో నడిచే మోటార్ సైకిల్‌ ని రూపొందించారన్నారు. ఎంతో ఆలోచనలతో సరికొత్త ప్రయోగాలు చేసే వాళ్ళే మెకానిక్స్ లని, అటువంటి వారు ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు అందించడానికి కృషి చేస్తామని, కాలానికి అనుగుణంగా ఐక్యమత్యంతో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బందెల హనుమంత్ రావు, కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, కోశాధికారి బురిడి సత్య వర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *