సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామ్‌ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’ (Peddi). స్పోర్ట్స్‌ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచుకొన్నప్పటికీ క్లైమాక్స్ విషాదం అన్ని వర్గాలను అలరించకపోవడంతో ఆశించిన విజయం సాధించలేక పోయింది. అయితే రామ్ చరణ్ నటుడిగా,డాన్సర్ గా మరో మెట్టు ఎక్కాడు.. రామ్‌ చరణ్, జాన్వీ కపూర్ జంటగా జగపతిబాబు, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు దర్శకత్వంలో ఏ ఆర్ రెహమాన్ సంగీతం హైలైట్ గా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi). జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. హిందీలో స్ట్రీమింగ్ మాత్రం కాస్త సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *