సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో నేడు,శనివారం ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరివేసుకునిఆత్మహత్య కు పాల్పడ్డారు. మృతులు తల్లి రజని (60), కుమార్తె గౌరి (40), కోడలు మధు (35)గా గుర్తించారు. నేటి శనివారం ఉదయం పూట తండ్రికుమారులు వ్యవసాయ కూలి పనులకు, సిమెంట్ పనులకు వెళ్లారు.మగవారు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న ముగ్గురూ మహిళలు కలిసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన వెనుక ఎంతటి బలమైన, బాధాకరమైన కారణం ఉంటుందో ఊహకు అందటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *