సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేను ఏ నేరం చెయ్యలేదు. ఎవరిని చంపలేదు.. మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టె నా కొ…ను చెప్పుతో అటు త్రిప్పి ఇటు త్రిప్పి.. అని ప్రశ్నించినందుకు గత 5 రోజులుగా కోర్టులు వరుసగా బెయిల్ లు ఇస్తున్నప్పటికీ బయటకు రాగానే మరో జైలుకు త్రిపుతూనే ( ఇప్పటికి 5 చోట్ల.. రావణ్ 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడని సమాచారం ) రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా భయపడుతోందని పాపం నాకోసం 500 మంది పోలీసులు అధికారులు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని, దీనికన్నా నన్ను చంపెయ్యడం బెటరని, అయితే మరొకరు ప్రశ్నించడం మానరని ‘ప్రశ్న’రావణ్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది..ఇదిలా ఉండగా తెలంగాణ కు చెందిన యూట్యూబర్ జర్నలిస్ట్, జోసఫ్ రావణ్ తో పాటు ‘కెవి ఆర్’ అనే మరో జర్నలిస్టు ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి ఇలా తరుచు ఏపీ కి తరలించడం ఫై ఆగ్రహంతో తెలంగాణాలో కొందరు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు యూ ట్యూబర్స్ ఆగ్రహంతో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫై , ఏపీ నేతలపై ఆగ్రహంతో టీఆరెస్ నేత, కవిత సహకారంతో మరో ఉద్యమానికి పిలుపు ఇస్తున్నారు. .ఇదిలా ఉండగా దేశ సార్వభౌమాధికారానికి, సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై యూట్యూబర్ రావణ్‌పై తాజగా విజయవాడ గన్నవరం పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ ముఖ్య నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేశారు. సమాజంలో ద్వేషాన్ని పెంచి పోషించడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వంటి తీవ్రమైన అంశాలను ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు.
