సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా విశాఖ సముద్ర తీరంలో విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు బీకరమైన అలల తాకిడికి పడవ బోల్తా పడి గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై . విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.భోగాపురం మత్స్యకారులు గల్లంతుపై విజయనగరం, విశాఖ కలెక్టర్లు రామ్ సుందర్‌రెడ్డి, అభిషిక్త్ కిషోర్‌తో మంత్రి కొండపల్లి, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు
