సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇన్ని అరెస్టులు జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఏమి చేస్తున్నాడు. దూరంగా ఉంటాడా?ఆయనకు పట్టదా ? అని జడ శ్రవణ్ కుమార్ ప్రశ్నించడం తో అనుకుంటా కదలిక వచ్చింది… నేడు, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు ఆదివారం .ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్, సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య సహా వివిధ కేసులను వాటిలో ప్రభుత్వ అసమర్ధత , కక్ష సాధింపు ప్రస్తావించిన వైఎస్ జగన్.. గతంలో మీరు ప్రశ్నించిన తరహాలోనే వారు మిమ్మిలిని ప్రశ్నిస్తే వరుసగా అరెస్ట్ లు చేయించేస్తారా?చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ గతంలో ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో.. వీళ్లు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు అవే అభియోగాలు మీ మీదకూడా కేసులు పెట్టాలికదా? అని జగన్ ప్రశ్నించారు. జర్నలిస్ట్ ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను చట్టాలు పాటించకుండా హైదరాబాద్ నుంచి పోలీసు బలగాలతో తీసుకువచ్చారని, చేయనివాటిని కూడా చేసినట్లు ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపించారని జగన్ ఆరోపించారు. యూట్యూబర్ రావణ్‌కు నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వస్తే.. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారని, ఇటువంటివి సహించమని జగన్ పేర్కొన్నారు.
