సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ వారిని పెట్టుబడుల కోసం రాష్ట్రానికి ఆహ్వానిస్తూ న్నారు. నేడు, గురువారం ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశ మయ్యారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రం విస్తరించాలని కోరారు. పీబీవీ వాహనాలతో సహా ఈవీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖ సమీపంలో సీకేడీ అసెంబ్లీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్ల తయారీ కేంద్రం ప్రతిపాదనను కియా ముందు ఉంచారు. ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలిస్తామని కియా మోటార్స్ ప్రతినిధులు ప్రకటించారు.
