సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జనసేన పార్టీ పెట్టిన కేసులు నేపథ్యంలో యూ ట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అరెస్టులు వరుసగా 4చోట్ల బెయిలు రావడం తదుపరి 5వ సారి గన్నవరం లో జనసేన నేత ఏకంగా రాజద్రోహం కేసు పెట్టిన దరిమిలా రావణ్ జైలు పాలు అయిన వ్యవహారం ఫై వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సైతం మీడియా తో మాట్లాడుతూ..… రావణ్ నిజానికి ముందు నుండి పవన్ కళ్యాణ్ వీర అభిమాని అని. అయితే ‘టీడీపీ వారి కుట్ర’లో భాగంగా ఇటీవల జనసేన ను, వైసీపీ ని బూతులు తిట్టాడు కానీ. నారా లోకేష్ ను కానీ చంద్రబాబు ను వ్యక్తిగతంగా ఒక్కమాట అనలేదని, రావణ్ వారి సామజిక వర్గానికి చెందినవాడు కావడంతో 4 చోట్ల సునాయాసంగా బెయిల్ లు వచ్చేశాయని ఆరోపించారు. అందుకే టీడీపీ కీలక నేతలు ఎవరు రావణ్ ను ఇప్పటివరకు విమర్శించలేదని చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. వాటిని ఇప్పటివరకు టీడీపీ నేతలు మంత్రులు ఖండించక పోవడాన్ని సీఎం చంద్రబాబు తాజగా జరిగిన కేబినెట్ సమావేశంలో తప్పు పట్టినట్లు తెలుస్తుంది. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన రావణ్ తీరుపై అతని అరెస్టుపై వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శంచడాన్ని జనసేన నేతలు తిప్పికొట్టినా..నేను స్వయంగా ఖండించాను తప్ప.. టీడీపీ మంత్రులు మౌనవ్రతం పాటించడం ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం చంద్రబాబు మంత్రులకు ఉద్బోధ చేసారని సమాచారం.
