సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం – బెంగళూరు (ఎస్ఎమ్వీబీ) రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీసును నేడు, శుక్రవారం మధ్యాహ్నం పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నరసాపురం–బెంగళూరు సర్వీసుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. సగటున 100 శాతం పైగా ఆక్యుపెన్సీతో నడిచిన ఈ రైలును ప్రజల డిమాండ్ మేరకు రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి, రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చేందుకు కృషి చేసి విజయవంతమయ్యామని దీనితో ప్రయాణికులకు టికెట్ చార్జీలు 30 శాతం తగ్గుతాయని తెలిపారు
