సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు అమరావతిలో మాట్లాడుతూ.. జగన్‌ది ‘హిట్ అండ్ రన్’ మనస్తత్వమని . రాష్ట్రంలో టీడీపీ వారిని ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టి అరాచక సంఘటనలు జరిగేలా చేసి, తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని విమర్శించారు. జగన్ చేష్టలకు తాము మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చిపోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. అనంతపురంలో ఇటీవల జరిగిన సంఘటనల వెనుక కూడా ప్రత్యర్థుల ప్రేరేపణ, ఉచ్చు పన్నే ప్రయత్నాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలు జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. తనకు సహకరించని వారిపై దాడి చేయడం, వారిని లక్ష్యంగా చేసుకోవడం ఆయన తీరుగా మారిందని,జగన్ నమ్ముకునేది రెండే రెండు అంశాలని.. ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *