సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా పౌరులు తమ ఓటు హక్కును కాపాడు కొనేందుకు ఈ 3 రోజులు అత్యంత కీలకం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిసితి గమనిస్తే .. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలు పూర్తీ చేసి బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. డిజిటలైజేషన్‌కు సమయం కావాల్సి ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే గడువు సమీపిస్తున్న చాల నియోజకవర్గంలలో ఇంకా ఎన్యూమరేష న్ ఫారాలు మిగిలిపోవడం, లేదా తీసుకున్న ఫారాలను ప్రజలు తిరిగి ఇవ్వక పోవడం అధికారుల్లో సచివాలయ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుంది. అయితే చాల ప్రాంతాలలో ఇప్పటికి 50 – 60 శాతం ఓటర్లు తమ వివరాలు ఫారమ్ పూర్తీ చేసి తిరిగి ఇవ్వడమే గగనంగా మారిందని సమాచారం. బీఎల్‌వోల పర్యవేక్షణ లోపం వెరసి ప్రజల ఓట్లకు గండి పడే అవకాశం ఉంటుందని ఓటర్లు అనుమానిస్తున్నారు. ఆ ఫారాల ను పూరించడం కష్టతరమని రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ప్రజలు కు 2 లేదా మూడు ప్రాంతాలలో ఓటు హక్కు విషయం బయటపడితే ప్రభుత్వ పధకాలు అందవు అనే భయం కూడా ఉంది. ఏదీ ఏమైనా సర్ కు గడువు మరింత పెంచే? అవకాశం కనపడుతుంది.
