సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. భీమవరం నుండి హెలికాప్టర్‌లో జగ్గయ్యపేటకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి వెళ్లారు. పద్మనాభం భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తన తండ్రి సమానుడు అయిన పద్మనాభంగారి తో అనుబంధం మరచిపోలేనని, వైసీపీ కోసం ఏంతో శ్రమించారని. ఆయన పోరాట స్ఫూర్తి తో అయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తానని ప్రకటించారు, అయన పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం ఎవరు ఊహించని విధంగా ముద్రగడ పద్మనాభం పాడె మోసిన జగన్..ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ , పేర్ని నాని వావంటి వైసీపీ నేతలతో పాటు రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకొన్నారు కిర్లం పూడి అంత వేలాది మందితో జనసంద్రంగా మారిపోయింది.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే అంత్యక్రియలు దహనం కాకుండా ఖననం చేసి ఆయన ఆఖరి కోరిక నెరవేర్చారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *