సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు (ఈఏపీసెట్) నేడు, సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నే కాదు తెలుగు రాష్ట్రాలలో టాపర్ కాలేజీలు గా ప్రసిద్ధి పొందిన భీమవరం లోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్, ఎస్ ఆర్ కే ఆర్ ఇంజినీరింగ్. డి ఎన్ ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలకు విద్యార్థుల నుండి మంచి డిమాండ్ ఉంది. ఇక రాష్ట్రంలో నెంబర్ 1 గా ఉన్న శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లకు డిమాండ్ మాములుగా లేదు. ఎంసెట్ ర్యాంకింగ్ ద్వారా తమకు నుంచి కాలేజీలో విద్యను అభ్యసించాలంటే విద్యార్థులు ఈ నెల 20 నుంచి 29 వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 31 వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగనుంది. ఆగస్టు 6న విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 7నుంచి 13 వరకు విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
