సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైద్య అధికారులు తగిన ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చెయ్యనున్నారు. ఇంకా జిల్లాలో ఎక్కడ కేసు నమోదు కానప్పటికీ ఏలూరు ప్రబుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 10 ఐసీయూ పడకలు సిద్ధం చేసారు. దానికి తగిన వైద్యు లు, సిబ్బందిని ఏర్పాటు చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే వారికి అవసరమైన చికిత్స అందుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ప్రకటించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పలు కీలక పట్టణంలలో ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం 5 పడకల నైనా కోవిద్ రోగుల కోసం వార్డులను సిద్ధం చేసి,.అవసరమైన మందులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మాస్క్ లకు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
