సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఆంధ్ర ప్రదేశ్ కాబినెట్ మంత్రుల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుమారు మూడు గంటలపాటు కొనసాగింది.అగస్ట్ 1న ప్రారంభిస్తున్న భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి, తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.రాష్ట్రంలో వర్షాలు తగ్గిన నేపథ్యంలో కరువు లేకుండా రైతులకు పొలాలకు నీటి పంపిణి పశువుల మేతకు ముందస్తు ఏర్పాట్లు చెయ్యాలని నిర్ణయించారు.
