సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలం లో యువ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస విభిన్న తరహా చిత్రాలుతో విజయాలు సాధిస్తున్నారు. నేడు, శుక్రవారం ఆయన నటించిన ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీగౌరి ప్రియ కథానాయిక. రవి నంబూరు దర్శకుడు. ‘కలర్‌ ఫొటో’, ‘బేబీ’ చిత్రాలతో సంచలన విజయాలు సాధించిన సాయి రాజేష్‌, నిర్మాత ఎస్‌కెఎన్‌తో కలిసి తీసిన సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి రాజేశ్‌ కథ అందించారు. మణిశర్మ స్వరపర్చిన పాటలు, ట్రైలర్ లతో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయి. . మరీ చిత్రం కధ విషయానికి వస్తే.. నెల్లూరుకు చెందిన స్టీవెన్‌ శంకర్‌ ఓ అనాథ. సినిమాపై పిచ్చితో ఎలాగైనా డైరెక్టర్ కావాలనే తపనతో తన విషాద కధలకు తమిళ సినిమా కరెక్ట్ అని చెన్నైలో వాలిపోతాడు. నివేదిత అలియాస్‌ నివి (శ్రీగౌరీ ప్రియ)కి మూడేళ్ళు ప్రేమించిన అబ్బాయితో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. చెన్నైలో ఉద్యోగం చేసే నివీ ఆ మందుకు బానిస అవుతుంది. ఆమె స్నేహితులకు పరిచయమైన స్టీవెన్‌ను అదే ప్లాట్‌లో ఉండమని పిలుస్తారు. మొదట్లో నివి అతనిపై విరుచుకు పడుతుంది అయితే స్టీవెన్‌ సినిమా కష్టాలు తెలుసుకున్నాక ఓ నిర్మాతతో మాట్లాడి కథ చెప్పే అవకాశం ఇప్పిస్తుంది. అలా స్టీవెన్ ఓ మంచి కథ చెప్పడం, దర్శకుడిగా అవకాశం పొందటం జరుగుతుంది. ఓ సందర్భంలో నివి ‘మనం పెళ్ళి చేసుకుందామా?’ అని స్టీవెన్ ను అడగడంతో అతను వెంటనే సరేనంటాడు. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు స్టీవెన్‌కు యాక్సిడెంట్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నివిని పెళ్లి పీటల మీద వదిలేసిన అజయ్‌ (తిగుణ్‌) మళ్లీ ఎందుకు ఆమె జీవితంలోకి వచ్చాడు? అన్నది కథ. ఇక సినిమా ఎలా తీశారు అంటే.. ఇక్కడ ప్రేమలో విఫలమైన అమ్మాయి యాంగిల్‌లో సినిమా చూపించారు..ప్రేమ విఫలమైన బాధ నుంచి హీరోయిన్‌ని బయటకు తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నాలతో ఆసక్తిగా సాగుతూ అసలైన కథలోకి ప్రేక్షకుడిని తీసుకు వెళ్తుంది. ఇంటర్వెల్‌ సీన్స్‌ మాత్రం ఊహకు అందకుండా ఓ సస్పెన్స్‌లా ఉంటుంది. చనిపోయిన వ్యక్తులు మాట్లాడుతూ.. కాస్త ఫాంటసీ జోడించారు. కామిడి,ఎమోషనల్‌ మిక్స్ చేసి సన్నివేశాలు చక్కగా మలిచారు. స్టీవెన్‌ శంకర్‌ పాత్రకు కిరణ్‌ సూపర్ గా సెట్ అయిపోయారు. నివి పాత్రలో శ్రీగౌరి ప్రియ అద్భుతమైన నటన కనబర్చింది.భావోద్వేగ సన్నివేశాల్లో కట్టిపడేసింది. కీలక పాత్రలో త్రిగున్‌ ఫర్వాలేదనిపించారు. నరేష్, సిరి హనుమంతు, దేవి ప్రసాద్‌, ప్రమోదిని చక్కగా నటించారు. సీనియర్‌ దర్శకుడు పి. వాసు, కరుణకుమార్‌ కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ. సంగీతం పెద్ద హైలైట్.. . సినిమాటోగ్రఫీ కూడా సీనియర్ వంశీ సినిమాల తరహాలో బాగుంది. నిడివి కాస్త ఎక్కువ అయినా ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *