సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా కోసం ఉద్యమించిన విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన పోలీస్ దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు, శుక్రవారం కోస్టల్ ఆంధ్రాలో అన్ని ప్రముఖ విద్యాసంస్థల రాజధానిగా పేరున్న భీమవరంలో బంద్ విజయవంతం అయ్యింది.. అన్ని ప్రభుత్వ ప్రవేటు స్కూల్స్ కాలేజీలు సమ్మెకు మద్దతుగా మూసివేశారు. ఎస్ ఎఫ్ ఐ తో పాటు పలు విద్యార్థి సంఘ నేతలు పట్టణంలో విద్యాసంస్థలను పర్యవేక్షించారు. విద్యార్థుల పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను నిరసించారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో నేడు, శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ సీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. నీట్‌ సహా విద్యావ్యవస్థలో కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే వారి కీలక డిమాండ్ తో పాటు నీట్‌ పేపర్‌లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న 20 కి పైగా విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వడంతో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి, కొత్తగా కేసులు పెట్టవద్దని కీలక డిమాండ్ లు చేసారు. రేపు కూడా చర్చలు కొనసాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *