సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్‌ మార్కెట్‌ ఈవారం సీజన్ నిన్న శుక్రవారం తో ముగియడం.. ఇటీవల ఎన్నడూ లేని విధంగా ఈ వారంలో సూచీలు వరుసగా ఐదో రోజులు నష్టపోవడము గమనార్హం. గల్ఫ్ ఉద్రిక్తతల కారణంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరలతో పాటు ట్రంప్‌ తాజాగా మరోమారు సుంకాల వడ్డింపు ఇందుకు కారణమయ్యాయి. గత శుక్రవారం ఆరంభంలో ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 917 పాయింట్ల మేర క్షీణించి 75,474 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి భారీ నష్టాల నుంచి కాస్త తేరుకోగలిగాయి. వారాంతం ట్రేడింగ్‌ నిలిచే సరికి సెన్సెక్స్‌ 331.62 పాయింట్ల నష్టంతో 76,059.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 102.15 పాయింట్లు కోల్పోయి 23,767.45 వద్ద ముగిసింది. కాగా, గడిచిన 5 సెషన్ల (ఈవారం)లో సెన్సెక్స్‌ 2,091.68 పాయింట్లు (2.67 శాతం), నిఫ్టీ 566.85 పాయింట్లు (2.32 శాతం) నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి రూ.96.53 వద్ద ఆగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *