సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడటంలేదు. నైరుతి రుతుపవనాలు వేగం తగ్గింది. నీటి ఎద్దడి కనపడుతుంది. పంటలు ఎండిపోయి కరువు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, శనివారం గోదావ‌రి, కృష్ణా డెల్టాల‌ ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈల‌తో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జ‌లాల‌ను గోదావ‌రి డెల్టా ఖ‌రీఫ్ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నామని. పోల‌వ‌రం కుడి ప్రధాన కాలువ ద్వారా వ‌చ్చే నీటిని దుర్వినియోగం కాకుండా, కృష్ణా డెల్టాకు అందేలా అధికారులు చర్యలు చేప‌ట్టాలని ఆదేశించారు. ఎల్‌నినో క్లిష్ట స‌మ‌యంలో ఇరిగేష‌న్ శాఖలో పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంద‌రూ అందుబాటులో ఉండేలా సెల‌వులు ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నిమ్మల తెలిపారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవ‌స‌రాల‌కు, ఆరుత‌డి పంట‌ల‌కే వినియోగించాలని సూచించారు.పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా తూర్పుగోదావ‌రి, కాకినాడ, విశాఖ‌ జిల్లాల్లో సుమారు 55 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని మంత్రి తెలిపారు. గోదావ‌రి డెల్టా లో మెర‌క ప్రాంత రైతులు ఆరుతుడి పంట‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించి ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *