సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిద్ కేసులు . మరణాలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిద్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలో నిన్న శుక్రవారం మరో ఏడు కరోనా కేసులు నమోదవడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39కు చేరింది. నిజానికి నమోదు కానీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. తాజగా తూర్పు గోదావరి జిల్లాల్లో ఐదు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 266 మంది నమూనాలను పరీక్షిస్తే 39మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. 17మంది హోం ఐసోలేషన్లో, 13మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు, ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లు, అవసరమైన మందులు, ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేసింది. ఎవరికైనా కోవిద్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *