ససిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవరం పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఈ విద్య సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు శ్రీతుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలోఉండి రోడ్డులోని హనుమత్కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) చేతుల మీదుగా, ఒక్కొక్కరికి రూ 2500 చొప్పున నగదు ప్రోత్సహాన్ని మెరిట్ స్కాలర్ షిప్స్ ను అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, పదో తరగతి, ఇంటర్లో ఈ ఏడాది అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారని, గత దశాబ్ద కాలంగా తుమ్మలపల్లి ట్రస్ట్ ద్వారా విద్య ఆర్ధిక ప్రోత్సాహకాలు అందివ్వడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి శివ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.కార్యక్రమంలో ఛాంబర్ అఫ్ కామర్స్ అడ్జక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా,చెరుకువాడ రంగసాయి నందమూరి రాజేష్, తుమ్మలపల్లి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
