సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ యువత పెద్ద విజయం సాధించారు. నేటి శనివారం మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. దేశంలో అడ్డు అదుపు లేని వ్యాపార దోపిడీకి పలువురు కార్పొరేట్ ప్రవేటు విద్యాసంస్థలు యాజమన్యాలు పాలబడుతుండటం, ప్రభుత్వలు ఎవరు వచ్చిన దానిని చూసి చూడనట్లు వదిలెయ్యడం, దానికి తోడు కీలక మైన ఉన్నత విద్యకు అర్హత కోసం జరిగే ఎంట్రన్స్ పరీక్షల పేరుతొ జరుగుతున్నా వేల కోట్ల వ్యాపారం.. ఇంతకష్టపడి చదివి అప్పులపాలయి చదువుకొన్న విద్యార్థులకు.. కొందరు ద్రోహులు తమ పలుకుబడి ఉపయోగించి వ్యాపార కాంక్షతో పేపర్ లీక్ లతో ‘క్షమించరాని ద్రోహం’ చెయ్యడం.. ఈ ద్రోహులతో, భవిషత్తు తో పోరాడలేక ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాలబడటం పర్రిపాటిగా మారింది. అయితే ఈసారి భారత యువత ఊరుకోలేదు. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా కదం త్రొక్కారు. ఇటీవల నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే 20 కి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు నైతిక బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ కాలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ దిగిరాలేదు. అయితే యువత వెనక్కి తగ్గలేదు. లాటి దెబ్బలకు భయపడలేదు. రోజురోజుకి మరింత ప్రబంజనంలా ఢిల్లీ విధులలో ఎగసి పడ్డారు. దీనికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు లభించింది. ప్రపంచం భారత్ వైపు ఆసక్తిగా చూస్తుంది. ఉద్యమ తీవ్రత గ్రహించి కేంద్రం దిగిరాక తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *