సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో రాజకీయాలకు అతీతంగా కాపు నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ముద్రగడ , మాజీ రాష్ట్ర పిసిసి ప్రసిడెంట్, మాజీ కొవ్వూరు ఎమ్మెల్యే, జి ఎస్ రావు ల సంస్మరణ సభలో వారి ఫోటోలకు పుష్ప మాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. కాపు రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటని, అలాగే జిఎస్ రావు లాంటి నేతను కోల్పోవడం దురదృష్టకరమని జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , కొత్తపల్లి సుబ్బారాయుడు, వైసీపీ భీమవరం ఇంచార్జి వెంకటరాయుడు, ఆరేటి ప్రకాష్, గన్నాబత్తుల శ్రీనివాస్ కాగితపు రమణ తదితరులు అన్నారు. భీమవరం పట్టణ లోని ఆనంద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం స్మరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ముద్రగడ కాపుల రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, నీతి నిజాయితీతో రాజకీయాల్లో తనకంటూ ఆయన ఒక ముద్ర వేసుకున్నారన్నారు
