సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రెవేటు మార్కెట్ లో ‘ఏదొక మిష ‘తో నాణ్యమైన బియ్యం రేటు అడ్డు అదుపు లేకుండా పెంచుకొని అమ్ముకోవడం చూస్తున్నాము. ఈ ఇబ్బందులను కొంతయిన తగ్గించేందుకు రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు జరగనున్నట్లు పవన్ పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52, పచ్చి బియ్యం కేజీ రూ.50కి అందజేయడంతో సామాన్యులకు ఊరట లభించనుందని తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
