సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవాలయంలో నిత్యం జరిగే భక్తుల అన్న సమారాధన కోసం శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ మరియు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్స్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి,, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర మిత్రబృందం 23 మంది సంయుక్తంగా ₹3,15,000/- మూడు లక్షల పదిహేను వేల రూపాయలు కానుకగా అందచేసారు.వీరికి విశేష పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అరసవల్లి సుబ్రమణ్యం పాపోలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *