సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్ష కాలంలో వర్షాలు లేక సాగు లేక భారీగా పెరిగిన కూరగాయల ధరలు మళ్లీ కాస్త దిగొస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మళ్లీ కూరగాయలలు ఆకూ కూరలు ఉత్త్పత్తి పెరిగి వాతావరణం చల్లబడటంతో మార్కెట్కు సరఫరా పెరిగి కూరగాయల ధరలు సాధారణ స్థితిలోకి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం నాణ్యత ను బట్టి రిటైల్ మార్కెట్ లో కాస్త అటుఇటూగా టమాటా కిలో రూ.15-20 బంగాళా దుంపలు కిలో రూ. 25-30గా విక్రయిస్తున్నారు. అలాగే ఉల్లిపాయ కేజీ రూ 30-.37, క్యాబేజీ రూ.15, కేజీ వంకాయను,బీట్రూట్, బెండకాలను రూ.30-40కు విక్రయిస్తున్నారు.కాకరకాయ కిలో 35-40 రూపాయలకు అరటికాయ ఒక్కొకటి 8-10 రూ కు లభిస్తున్నాయి. మూలగా కాడలు దిగివచ్చి 6-10 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. ఇటీవల రైతు బజార్లలో బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయలు లభిస్తుండటంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
