సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: డి.ఎన్.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (A), భీమవరం యాన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) మరియు అల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ సహకారంతో “నషా ముక్త యువ – వికసిత్ భారత్”అనే అవగాహన కార్యక్రమం నేడు శుక్రవారం (31-07-2026) నిర్వహించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి పాత్రను చాటిచెప్పడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) నిర్మాణంలో యువత బాధ్యతను తెలియ జేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ప్రత్యేక ఆహ్వానితులు పశ్చిమ గోదావరి జిల్లా డి.ఎస్.పి. శ్రీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ ..మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన చట్టాలు, శిక్షలు, యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) , ళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగరాజులు మాట్లాడుతూ ..తల్లిదండ్రుల ఆశలను, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *