సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వర్ష కాలంలో వర్షాలు లేవు. ఎదో వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీలో కాస్త భారీ వర్షాలు పడుతున్నాయి అనుకొంటే మరల 2 రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు కష్టాలు మొదలయ్యాయి.. ఖరీఫ్‌ మొదలై రెండు నెలలు గడిచినా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. జూన్ 1 నుంచి ఆగస్టు 3 వరకు చూస్తే రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 50.80శాతం తక్కువ వానలు పడ్డాయి. అలాగే రాష్ట్రంలో పంటలు కూడా సాధారణ విస్తీర్ణంలో 43% మాత్రమే పంటలు సాగయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎండాకాలాన్ని తలపిస్తూ 40 డిగ్రీలు పైగా నమోదు అవుతున్నాయి..రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 73.50శాతం లోటు వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో సాధారణం కంటే 66.80శాతం, చిత్తూరు జిల్లాలో 63.50శాతం మొదటి మూడు స్థానాలలో ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో 57.60శాతం, , తూర్పుగోదావరి జిల్లాలో 53.60శాతం, తక్కువ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 397 మండలాల్లో లోటు వర్షపాతం.. 205 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీనితో అన్ని జిల్లాలో పంట సాగు విస్తీర్ణం తగ్గింది. ఇప్పటికే మార్కెట్ లో బియ్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *