సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవనంలో రేవతి నక్షత్ర గడియల్లో మహా మన్యు యాగం నేడు, మంగళవారం నిర్వహించారు. ఉదయం నుంచి108 సార్లు మన్యుసూక్త పారాయణలు, అభిషేకాలు సంపుటితో శత్రుత్ చేదక,హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వేద పండితులు మహామన్యుయాగం నిర్వహించగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, భమరాంబ దంపతులు యాగ కర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి నష్టం కలిగించేందుకు ధర్మ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి అని అన్నారు. ఇటువంటి కఠిన పరిస్థితుల నుండి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునేందుకు విశ్వహిందూ పరిషత్ బాధ్యతగా దేశ సంరక్షణ కోసం ఈ కార్యక్రమానికి పూనుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి సీతారామరాజు, కమలాకర గుప్త, అరవ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *