సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని నేడు, బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సందర్శించారు. తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్‌లో దేవరపల్లి చేరుకున్న ఆయన కు అభిమానుల నుండి ప్రజల నుండి ఘన స్వగతం లభించింది. రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. వారికీ అభివాదాలు చేసుకొంటూ జగన్ .. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పొగాకు వేలం కేంద్రానికి వెళ్లారు. ఎక్కడ చుసిన జన సంద్రం నేపథ్యంలో భద్రతా పరంగా ముందుచూపుతో పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్‌ను చూడటానికి భవనాల పైకి ఎక్కిన అభిమానులు, కార్యకర్తలను.. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కిందకు దించేశారు, జగన్ కోసం యార్డు లోపలికి ‘రైతులు’ మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు జగన్ ను కోరారు. ఈ ఏడాది మంచి క్వాలిటీ గ్రేడ్ ఆకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ధరలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. 20 వేల నుంచి రూ. 24 వేల వరకు పలకాల్సిన బ్రైట్ రకం రూ. 16 వేల నుంచి రూ. 17 వేల వరకే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై తమ వైసీపీ ఎంపీలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను రైతులను గాలికి వదిలేసి దోపిడీ పనిలో ఉందని ఇంకా కాస్త ఓపిక పడితే తన ప్రభుత్వం వస్తుందని పొగాకు రైతులను గతంలో వలే అదుకొంటామని జగన్ భరోసా ఇచ్చారు,
