సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ లో జరిగిన డీఎస్సీ నియామకాల అవకతవకల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తో విచారణ చేయించాలని, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవి కి రాజీనామా డిమాండ్ చేస్తూ స్థానిక వైసీపీ నేతలు నియోజక వర్గ పార్టీ ఇంచార్జి వెంకట రాయుడు ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్‌లో చేపట్టిన నిరసన దీక్షకు నేడు, గురువారం సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు సంఘీభావం ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే లేదా స్వతంత్ర న్యాయ కమిషన్‌తో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతున్నట్లయితే న్యాయ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం. సీతారాం ప్రసాద్, భీమవరం పట్టణ నాయకులు నాగిడి శాంతమూర్తి, మోకా నరశింహమూర్తి దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
