సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల విలేజ్ సెక్రటరీలతో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వామ్యులుగా చేసి, ప్రతి గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా, ప్రగతిపథంలో నడిపించే లక్ష్యంతో “మన గ్రామం – మన బాధ్యత” అనే నూతన కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యంతో స్థిరమైన అభివృద్ధికి బాటలు వేయనున్నామని రఘురామకృష్ణ రాజు తెలిపారు.
