సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాటి చెట్లు ఎక్కుతూ కల్లు సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్ట కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని మద్యం షాపులు పెంచాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించు కోకపోతే తాము ఉద్యమ బాట పట్టకతప్పదని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సిం హమూర్తి హెచ్చరించారు. భీమవరంలో కామన మునిస్వా మి అధ్య క్షతన జరిగిన జిల్లా కల్లు గీతకార్మికులు కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యా లయం వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మి కులు పెద్ద సంఖ్య లో పాల్గొనాలని పిలు పునిచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *