సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై చాలా స్వల్పంగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉత్తరాంద్ర గోదావరి జిల్లాలలో పలు ప్రాంతాల్లో మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనేపథ్యంలో నేడు, ఆదివారం ఉదయం భీమవరం లో చిరుజల్లులు పడ్డాయి.అయితే ఉదయం 10 గంటల కల్లా భానుడు తన ప్రతాపం చూపించాడు. ఇక పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదు అయ్యింది.
