సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ఒక ప్రేమ జంట పెద్దలు వివాహానికి ఒప్పుకున్నపటికి నేడు, మంగళవారం పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో ఆ ప్రేమ జంట దూకింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. ఆ జంట కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే కాలవలోకి దూకి యువకుడిని కాపాడారు. స్థానిక ఆసుపత్రిలో యువకుడు కోలుకున్నాడు. అయితే యువతి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.యువతి కోసం వారంతా గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భీమవరం పట్టణ సరిహద్దు గ్రామం కుముదవల్లి గ్రామానికి చెందిన కోలుకున్న ప్రేమికుడు సందీప్ కుమార్, చెప్పిన సమాచారం ప్రకారం.. తాము ఇద్దరం చిన్ననాటి స్నేహితులమని భీమవరం సెయింట్స్ మేరీస్ లో చదువుకొన్నామని తదుపరి వేరువేరు కాలేజీలలో చదువుకొన్నపటికి ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిందని ఇద్దరి పెద్దలు పెళ్ళికి అంగీకరించారని అయితే ఇటీవల ఆ యువతికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలియడంతో ఆమెతో పాటు ఆ ప్రేమికుడు.. ఇద్దరు కలసి చనిపోదామని నేడు, ఈ కాల్వలలో దూకామని తెలిపాడు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు ప్రేమికులు ఇద్దరు కాల్వలో దుకేముందు ఫోన్ లో సమాచారం అందించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *