సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రస్థాయిలో భీమవరం యుసిఎంఏఎస్ విద్యార్థులు 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్లో 6 ట్రోఫీలతో ప్రతిభ కనబరచడం మన జిల్లాకే గర్వకారణమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఈనెల 9న గుంటూరులోని ఏ కన్సర్వేషన్లో యుసిఎంఏఎస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన 10వ స్టేట్ లెవల్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను నేడు మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు వారి కార్యాలయంలో అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గణితంలో వేగం లెక్కల్లో ఖచ్చితత్వం ఏకాగ్రతలో అద్భుత ప్రతిభ కనబరచడం అమోఘమని, ఈ మూడు కలగలిపి భీమవరం యుసిఎంఏఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడం హర్షించదగ్గ విషయమన్నారు. స్టేట్ లెవల్ 6 ట్రోఫీలను సాధించామని, కే వర్షిత్, జి మోహిత్ శ్రీరామ్, అర్ కార్తికేయ, జి అనంత వర్మ, ఎ లక్ష్మీ ధనిష్యా, ఎ నివేదిత తార లు ప్రతిభ కనబరించారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *